పాణ్యం: అక్రమంగా వేసిన షాపులు తొలగించాలి

68చూసినవారు
పాణ్యం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల చూట్టూ అక్రమంగా వేసిన షాపులను తొలగించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజు నిరసన తెలిపారు. పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఈషాపులు అడ్డుగా ఉన్నాయని, వీటి వలన కాంపౌండ్ వాల్ నిర్మాణం ఆగిపోయిందన్నారు. ఆర్‌అండ్‌బీ అధికారులు తక్షణమే స్పందించి రోడ్డుకు ఇరువైపులా అక్రమంగా నిర్మించిన షాపులను తొలగించాలన్నారు.

సంబంధిత పోస్ట్