భర్త వేధింపులు తాళలేక మనస్తాపం చెందిన శారద అనే మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో శారద, అమృత, ఆదర్శ్ మృతి చెందగా.. అనుష్క డేలీని స్థానికులు రక్షించారు. ఈ ఘటన కర్ణాటక జిల్లా బెళగావి జిల్లాలోని రాయ్‌బాగ్ తాలూకాలోని చించలి గ్రామ శివార్లలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు భర్త ఆశోక్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.