అమ్మవారికి మొక్కును చెల్లించిన టిడిపి శ్రేణులు

77చూసినవారు
అమ్మవారికి మొక్కును చెల్లించిన టిడిపి శ్రేణులు
ఎన్నికల్లో ప్రత్తిపాటి పుల్లారావు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా చిలకలూరిపేట మండలంలోని బోయపాలెం గ్రామంలో నిలువైన పార్వతి అమ్మవారికి టీడీపీ నేతలు మొక్కు తీర్చుకున్నారు. కూటమి అధికారంలోకి రావాలని మొక్కు కోవడంతో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు గ్రామ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షుడు సాయిబాబు పోపూరి లక్ష్మి, జరీనా సుల్తాన్ తదితరులుపాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్