ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నరసరావుపేట పర్యటన రద్దయినట్లు పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా ఈ పర్యటన రద్దయినట్లు తెలిపారు. పార్కింగ్ ఏరియా మొత్తం వరదమయమైనట్లు తెలిపారు. కార్యక్రమం ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని కొమ్మలపాటి శ్రీధర్ తెలిపారు.