రేపు నరసరావుపేటలో జాబ్ మేళా

66చూసినవారు
రేపు నరసరావుపేటలో జాబ్ మేళా
రేపు నరసరావుపేట స్థానిక లింగంగుంట్లలోని ఏపీ ఎస్ఎసబీసీ నాక్ స్కిల్ హబ్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి సంజీవరావు ఆదివారం తెలిపారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు 3 కంపెనీలు పాల్గొంటాయని అన్నారు. 18 నుంచి 40 సంవత్సరాల వయసుగల నిరుద్యోగులు అర్హులన్నారు. తమ బయోడేటా, ఆధార్ తదితర జిరాక్సులు తీసుకొని ఇంటర్వ్యూకు హాజరు కావాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్