పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ యశ్వంత్ రావు అన్నారు. నరసరావుపేట పట్టణంలో సంక్రాంతి వరకే ప్లాస్టిక్ కవర్లకు అనుమతులు ఇచ్చామన్నారు. ఇక నుంచి వ్యాపారస్తులు ప్లాస్టిక్ సంబంధించిన కవర్లు అమ్మితే చర్యలు తీసుకుంటామని ఆదివారం అన్నారు. ప్రజలు కూడా బజారుకు వెళ్లేటప్పుడు సంచులు తీసుకువెళ్లాలని కోరారు.