పల్నాడు కలెక్టర్ గా శివ శంకర్ను కొనసాగించాలి: పృథ్వీరాజ్

61చూసినవారు
పల్నాడు కలెక్టర్ గా శివ శంకర్ను కొనసాగించాలి: పృథ్వీరాజ్
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకరు బదిలీ చేసిన విషయం జిల్లా ప్రజలను బాధిస్తుందని బిఎస్పీ నేత పృథ్వీరాజ్ మంగళవారం అన్నారు. నరసరావుపేట కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వినతిపత్రం ఉంచి మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల కోసం ఆయన నవోదయం కార్యక్రమం ఏర్పాటు చేసి అనేక వందల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారని అన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ గా లోతేటి శివశంకర్ ను కొనసాగించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్