సత్తెనపల్లి పట్టణంలోని ఐదులంతార్ల సెంటర్లో సోమవారం సాయంత్రం ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. సైకిల్పై వెళ్తున్న అయినవోలు శ్రీనివాస్ అనే వ్యక్తిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ కూ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ని అదుపులో తీసుకున్నారు.