రేగిడి ఆమదాలవలస మండలం నాగావళి నదీ పరివాహక ప్రాంతాల నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లపై ఆదివారం రేగిడి ఎస్సై నిలావతి వారి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు.