చీపురుపల్లి డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్ రాఘవులు సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పూల మొక్క ఇచ్చి తన అభినందనలు తెలిపారు. కాగా చీపురుపల్లి డిఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన రాఘవులకు ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా సమర్థవంతంగా పనిచేయాలని ఎస్పి సూచించారు. గంజాయి నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు.