గుర్ల: మృతుల కుటుంబాలను ఆదుకోవాలి: జెడ్పి చైర్మన్

50చూసినవారు
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుర్ల గ్రామంలో డయేరియా ప్రబలిందని. వెంటనే మృతుల కుటుంబాలను ఆదుకోవాలని జెడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బాధితులకు వైఎస్ఆర్ సీపీ తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బుధవారం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంతాలలో వైద్యం మచ్చుకైనా కనిపించలేదని జెడ్పి చైర్మన్ ఆన్నారు.

సంబంధిత పోస్ట్