గజపతినగరం: మెంటాడ మండలంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు
మెంటాడ మండలం కొంపంగి గ్రామంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక పారిశుధ్య పనులను ఏపీఎం సత్యనారాయణ పరిశీలించారు. డయేరియా వ్యాప్తి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో శానిటేషన్, క్లోరినేషన్ పనులను విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.