పిహెచ్‌సిని పరిశీలించిన డిడిఎంహెచ్‌ఒ టి. జగన్మోహనరావు

67చూసినవారు
పిహెచ్‌సిని పరిశీలించిన డిడిఎంహెచ్‌ఒ టి. జగన్మోహనరావు
గరుగుబిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మన్యం జిల్లా డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ టి. జగన్మోహనరావు గురువారం తనిఖీ చేశారు. ముందుగా పిహెచ్‌సిలో రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకొని రికార్డులో నమోదు చేస్తున్న తీరును పరిశీలించారు. చికిత్స కోసం పిహెచ్‌సికి వచ్చే ప్రతి రోగి పట్ల తక్షణమే స్పందించి వారు ఎటువంటి ప్రయాసపడకుండా చూడాలని అన్నారు.

సంబంధిత పోస్ట్