కురుపాం: పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

57చూసినవారు
గతంలో కురిసిన వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ నాయకులు కొల్లి సాంబమూర్తి, ప్రజా సంఘాల నాయకులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ, వర్షాలకు దెబ్బతిన్న పంటలను అధికారులు గుర్తించి, ప్రభుత్వం నుంచి త్వరగా పరిహారం అందించాలని కోరారు. ప్రతి 100 కేజీల పత్తి 16వేల రూపాయలకు కొనుగోలుకై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్