సీఎంకు రూ. 15 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే జగదీశ్వరి

57చూసినవారు
సీఎంకు రూ. 15 లక్షల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే జగదీశ్వరి
విజయవాడ వరదలలో ఇబ్బందులు పడిన ప్రజలకు సిఎం చంద్రబాబు చేసిన సాయాన్ని చిత్రమాల రూపంలో కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి సిఎం చంద్రబాబుకు శుక్రవారం అందజేశారు. అనంతరం బాధితులు కోసం సేకరించిన 15 లక్షల రూపాయల సహాయ నిధి చెక్ అందజేసి నియోజకవర్గంలో సమస్యలను సిఎం కు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జియ్యమ్మవలస ఎంపిపి బొంగుసురేశ్, నాయకులు దత్తి లక్ష్మణరావు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్