ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి ఎన్నికకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ నాటికి మన్యం జిల్లాలో 1, 862 మంది ఓటర్లు ఉన్నట్లు జె సి ఎస్. ఎస్. శోబిక వెల్లడించారు. ఈ నెల 23న ముసాయిదా ప్రచురణ అయిందని, దీనిపై దావాలు, అభ్యంతరాలను దాఖలు చేయడానికి డిసెంబర్ 9వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు ఆమె చెప్పారు. పోలింగ్ కేంద్రాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె ఛాంబరులో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు.