ఉరుములు మెరుపులతో కూడిన వర్షం

83చూసినవారు
ఉరుములు మెరుపులతో కూడిన వర్షం
గుమ్మలక్ష్మీపురం పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చెంది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. ఉదయం అంతా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు సాయంత్రం కురిసిన వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. ఈ వర్షం మామిడి పంట పై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్