నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి చంపావతి నది వద్ద బుధవారం సాయంత్రం కనుమ పండగ సందడి మొదలైంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి కనుమ రోజుల్లో చంపావతి నదీ తీరాన స్థానికులు పరిసర ప్రాంతాల నుంచి వచ్చి ఆనందంగా గడుపుతారు. నది తీరాన పలకరింపులు, బంధుమిత్రులు నూతన వస్త్రాలతో రకరకాల ఆటలు ఆడి సందడి చేస్తారు. ఈ పరిసరాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు.