పాఠశాల విద్యార్థికి అభినందన సభ

68చూసినవారు
పాఠశాల విద్యార్థికి అభినందన సభ
పాలకొండ మండలం పొట్లి గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదో తరగతి వరకు చదివిన శంభాన హనీ అనే విద్యార్థికి వెన్నెల వలస జవహర్ నవోదయాలో ఆరో తరగతిలో చేరేందుకు సీటు సాధించింది. ఈ మేరకు శుక్రవారం పాఠశాల హెచ్ఎం యందవ పుష్పనాదం అభినందన సభ నిర్వహించారు. చిన్నారి హనీ మరింతగా చదువులో రాణించాలని కోరారు. ఉపాధ్యాయుల నాగరాజు, సర్పంచ్ జి. కృష్ణారావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్