పాలకొండ మండల కేంద్రంలో దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. స్థానిక ప్రజలు దీపావళి సందర్భంగా గురువారం రాత్రి బాణసంచా కాల్చి వేడుకలు నిర్వహించారు. కాకరలు, చిచ్చుబుడ్లు, సీమటపాకాయలు, షాట్స్ వంటి వాటిని యువత ఉత్సాహంగా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మండల కేంద్రంలో టపాసుల మోత మోగుతోంది. ముందుగా మహాలక్ష్మి పూజలు నిర్వహించిన అనంతరం ఈ వేడుకలను చేపట్టామని స్థానిక వాసులు తెలియజేశారు.