పాలకొండలో మత్తు పదార్థాల నివారణపై నినాదాలు

52చూసినవారు
పాలకొండ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం మత్తు పదార్థాలు దుర్వినియోగం, నిషేధం అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించినట్లు పాఠశాల హెచ్ఎం మీసాల సూర్య నారాయణ తెలిపారు. మత్తు పదార్థాలు వాడటానికి వ్యతిరేకంగా విద్యార్థులచే నినాదాలు చేయించినట్లు తెలిపారు. మత్తు పదార్థాలు వాడకం అనేది చట్ట విరుద్ధమని అవగాహన కల్పించారు. విద్యార్థులు ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్