వీరఘట్టం: 1600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

53చూసినవారు
వీరఘట్టం మండలం చినగోర కాలనీ సమీపంలోని తోటల్లో సారా బట్టీలపై ఎస్ఐ జి. కళాధర్ శుక్రవారం దాడులు చేశారు. సారా తయారీకి 8 డ్రమ్ముల్లో ఉంచిన 1600 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. పోలీసులు వస్తున్నట్లు సమాచారం తెలియడంతో సారా తయారీదారులు తప్పించుకుని పారిపోయారని ఎస్ఐ తెలిపారు. సారా బట్టీలను నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ కళాధర్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్