విజయవాడ వరద బాధితుల సహాయార్థం బలిజిపేట మండలం పెదపెంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విరాళాలు పోగు చేసి 20 వేల రూపాయలను మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ కు అందజేశారు. గురువారం పెదపెంకి పాఠశాల హెచ్ఎం ఎం భాస్కరరావు, బలిజిపేట మండల విద్యాశాఖ అధికారి 1 సామల సింహాచలం నేతృత్వంలో విద్యార్థులు 20 వేల నగదును జిల్లా కలెక్టర్ కు అందజేశారు. విద్యార్థులను, పాఠశాల హెచ్ఎం ను కలెక్టర్ అభినందించారు.