ప్రజా సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకొనే స్వాతంత్ర్యం వచ్చిందని, నియోజక వర్గ సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. సోమవారం సాలూరు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) కార్యక్రమంలో మంత్రి పాల్గొని 139 మంది అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు.