ఎల్ కోట తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో మంగళవారం తాసిల్దార్ ప్రసాదరావు చలి వేంద్రాన్ని ప్రారంభించారు. వేసవికాలం నేపథ్యంలో ఎండల తీవ్రత అధికంగా ఉన్న కారణంగా తమ కార్యాలయ ఆవరణలో చలి వేంద్రాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. తాసిల్దార్ కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వస్తున్న ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు ఈ చలి వేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. వడదెబ్బకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.