ఎస్ కోట పట్టణం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా కార్యక్రమం చేపట్టారు. గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం హయాంలో విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు పెనుభారం మోపుతున్నారని సిపిఎం మండల కార్యదర్శి మద్దిల రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కూటమి ప్రభుత్వం పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.