ఎస్ కోట పట్టణానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సిఐ సూర్యనారాయణ శనివారం తెలిపారు. స్థానిక నూకాలమ్మ గుడి వద్ద ఉంటున్న అసరాడ బుజ్జి, అసరాడ నాయుడు అనే ఇద్దరు వ్యక్తులు గుదే పృథ్వీరాజ్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో పాటు కులం పేరుతో దూషించారు. ఈ దాడిలో గాయపడిన పృథ్వీరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు బుజ్జి, నాయుడు లపై ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు.