శాసనమండలి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానానికి జరగబోయే ఎన్నికల్లో ఓటుహక్కు పొందేందుకు నవంబర్ 6లోగా దరఖాస్తు చేయాలని ఈఆర్వో, విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహనరావు తెలిపారు. అర్హులైన ఉపాధ్యాయులు అందరికీ ఓటు హక్కు కల్పించాలని ఆయన కోరారు. అన్ని జిల్లాల్లో ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాలని సూచించారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్లో గురువారం సమావేశం నిర్వహించారు.