AP: ‘చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు. నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో వైసీపీ చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు చూపించారు’ అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈ నెల 27న ఎస్ఈలకు వినతి ప్రతాలిస్తామన్నారు. కంటైనర్ షిప్‌లో డ్రగ్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారన్నారు.