తిరుపతిలోని హోటల్‌కు మరోసారి బాంబు బెదిరింపులు

57చూసినవారు
తిరుపతిలోని హోటల్‌కు మరోసారి బాంబు బెదిరింపులు
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతిలో ఓ హోటల్‌కు మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. తిరుపతి పోలీసులకు బెదిరింపు కాల్స్‌ సవాల్‌గా మారగా, సదరు హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో అప్రమత్తమైన పోలీసులు అణువణువు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. మరోవైపు తరచూ ఇలా ప్రైవేటు హోటల్స్‌కు వస్తున్న ఫేక్‌ మెయిల్స్‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్