బేస్తవారిపేట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

76చూసినవారు
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లి గ్రామ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు కాగా 108లో చికిత్స నిమిత్తం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు బొందలపాడు గ్రామానికి చెందిన గురయ్యా, గోపిరాంగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్