ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొండపేట గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. కొండపేట గ్రామానికి చెందిన నాగేంద్ర (11) గాలిపటం ఎగరేస్తూ విద్యుత్ షాకుతో మృతి చెందాడు. గాలిపటం ఎగరేస్తున్న సమయంలో గాలిపటం తెగి ట్రాన్స్ఫార్మర్ సమీపంలోని ఓ చెట్టుపై పడింది. చెట్టుపై ఉన్న గాలిపటాన్ని అందుకుంటున్న క్రమంలో నాగేంద్రకు విద్యుత్ షాక్ సోకింది. దీంతో నాగేంద్ర మృతి చెందాడు.