ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో వానరాలు బెంబేలెత్తిస్తున్నాయి. కోటగడ్డ వీధి, శర్మ వీధి, పోలీస్ స్టేషన్ బజార్, బాలికల వసతి గృహం ప్రాంతాలలో అత్యధికంగా వానరాలు తిరుగుతున్నాయని శుక్రవారం స్థానిక ప్రజలు తెలిపారు. బజారు నుంచి నిత్యవసర వస్తువులు ఇంటికి తెచ్చుకుంటున్న సమయంలో తమపై వానరాలు దాడి చేస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.