ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో తుఫాను ప్రభావంతో 24 గంటలుగా చిరుజల్లులు కొరుస్తున్నాయి. ప్రస్తుత కురుస్తున్న చిరుజల్లులతో పచ్చిమిర్చి, శనగ పంటలకు మంచి మేలు చేకూరుతుందని స్థానిక రైతన్నలు సోమవారం తెలిపారు. బలమైన ఈదురు గాలులు లేకపోవడం వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడలేదు. అయితే విపరీతమైన చలిగాలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వర్షపాతం వివరాలు ఇంకా వెల్లడించలేదు.