గిద్దలూరు: విద్యుత్ శాఖ అధికారి ముసుగులో టోకరా

574చూసినవారు
గిద్దలూరులో శుక్రవారం విద్యుత్ శాఖ అధికారిని అని బంగారు దుకాణం యజమానికి ఓ అపరిచిత వ్యక్తి టోకరా వేశాడు. రూ. 92, వేలు విలువ చేసే 2 ఉంగరాలను తీసుకుని డబ్బులు మరిచిపోయి వచ్చానని తనతో ఎవరినైనా పంపిస్తే డబ్బులు ఇచ్చి పంపుతానని దుకాణ యజమానిని అపరిచిత వ్యక్తి నమ్మించాడు. తర్వాత ద్విచక్ర వాహనంపై యువకుడిని ఎక్కించుకొని వెళ్లిన అపరిచిత వ్యక్తి యువకుడిని వదిలి పరారయ్యాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

సంబంధిత పోస్ట్