జాతీయ జెండా ఎగురవేసిన వైసిపి ఇన్ ఛార్జ్

84చూసినవారు
జాతీయ జెండా ఎగురవేసిన వైసిపి ఇన్ ఛార్జ్
కనిగిరిలోని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం వైసిపి ఇన్ ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య జాతీయ జెండా ఆవిష్కరించారు. నాటి బ్రిటిష్ పాలన నుంచి ప్రజలందరికీ స్వేచ్ఛ లభించిన రోజు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్