పొగాకు ధర రికార్డుల మోత

56చూసినవారు
పొగాకు ధర రికార్డుల మోత
పొగాకు వేలం ధరలు నానాటికీ రికార్డులు తిరగరా స్తున్నాయి. కొండేపిలోని స్థానిక పొగాకు వేలం కేంద్రంలో శనివారం నిర్వహించిన వేలంలో పొగాకు అత్యధిక ధర కిలో రూ. 350 పలికిందని, కొండేపి బోర్డు చరిత్రలోనే ఇది రికార్డు ధర అని వేలం నిర్వహణాధికారి సునీల్ కుమార్ తెలిపారు. జువ్విగుంట, అయ్యవారిపాలెం, జాళ్లపాలెం, పీరాపురం గ్రామాలకు చెందిన రైతులు 1215 బేళ్లు తీసుకొనిరాగా 1137 బేళ్లు కొనుగోలయ్యాయి.

సంబంధిత పోస్ట్