కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు సమీపంలో బుధవారం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కోటయ్యను ఒంగోలుకు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. తర్వాత కారు బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ద్విచక్ర వాహన దారుడిని 108 అంబులెన్స్ లో మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బ్రహ్మనాయుడు తెలిపారు.