మార్కాపురం: మిద్దె మీద నుంచి పడి వృద్ధురాలు మృతి

75చూసినవారు
మార్కాపురం: మిద్దె మీద నుంచి పడి వృద్ధురాలు మృతి
మార్కాపురం మండలం గొట్టిపాడియా గ్రామంలో మిద్దె మీద నుంచి క్రిందపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన సుబ్బమ్మ మిద్దె ఎక్కి పూలు కోస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు క్రింద పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్