జెండా ఆవిష్కరణ చేసిన జడ్పీ చైర్పర్సన్

78చూసినవారు
జెండా ఆవిష్కరణ చేసిన జడ్పీ చైర్పర్సన్
ఒంగోలు జిల్లా పరిషత్ కార్యాలయం నందు జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, వారి పోరాట చరిత్రను కొనియాడారు. మహనీయులు కలలుగన్న స్వరాజ్యం కోసం అందరం ఐక్యంగా కృషి చేయాలని తెలిపారు. అనంతరం అందరికీ స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో జడ్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్