జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి స్వామి

65చూసినవారు
ఒంగోలులోని పోలీసు పెరెడ్ గ్రౌండ్ లో గురువారం నిర్వహించిన స్వాతంత్ర వేడుకలలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ అన్సారియా, ఎస్పీ దామోదర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి స్వామి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు సిబ్బంది ఆయనకు గౌరవ వందనం చేశారు. కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్