ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు యర్రగొండపాలెం ఎక్సైజ్ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. ఈ దాడులలో మండలంలోని చిన్న పిఆర్సీ తండా అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి ఉపయోగించే 200 లీటర్ల బెల్లం ఊటను ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.