దర్శి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దర్శి నియోజకవర్గం టిడిపి ఇన్ చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు భోజనాన్ని స్వయానా వడ్డించారు. ఈ కార్యక్రమంలో దర్శి మాజీ ఎమ్మెల్యే పాపారావు, ప్రిన్సిపల్ ఎస్వీ సుబ్బారావు పాల్గొన్నారు.