దర్శి మండలంలోని తూర్పు వీరయపాలెం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీ కొట్టి పొలాల్లో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతదేహం తూర్పు వీరయపాలెం కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.