
జగన్కు బిగ్ షాక్.. టీడీపీలో చేరిన కౌన్సిలర్లు
AP: వైసీపీ అధినేత జగన్కు మరో బిగ్ షాక్ తగిలింది. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీకి చెందిన మరో ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సమక్షంలో కౌన్సిలర్లు దారేష్, ఆచంట సురేశ్, అప్పయ్య, సత్తిబాబు, రాజేశ్వరి, గౌరి వనజ టీడీపీ కండువా కప్పుకున్నారు. తాజా చేరికలతో తుని మున్సిపాలిటీలో టీడీపీ బలం 10కి చేరింది.