ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 217 జయంతి వేడుకలలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఎమ్మెల్యే నివాళులు అర్పించారు. స్వాతంత్ర పోరాటంలో వెన్నుచూపని వీరుడు వడ్డే ఓబన్న అని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.