సిఎస్పురం మండలం మిట్టపాలెంలో సజీవ సమాధి రూపంలో వెలసి ఉన్న నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ పూజారులు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆదివారం రాత్రి ఆలయం చుట్టూ మేళతాళాలతో నారాయణస్వామి రథోత్సవం దేవస్థానం కమిటీ వారు నిర్వహించారు. దేవస్థానం కమిటీ వారు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను చేశారు.