జమ్మూలో విధి నిర్వహణలో ప్రాణాలు వదిలిన కంభం మండలం రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్ వరికుంట్ల సుబ్బయ్య రియల్ హీరో అని మాజీ సీఎం జగన్ కొనియాడారు. సుబ్బయ్య ల్యాండ్మైన్ ఉచ్చు నుంచి తన తోటి జవాన్లు 30 మందిని కాపాడడం స్ఫూర్తిదాయకమని అన్నారు. సుబ్బయ్య కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ప్రసాదించాలని.. అతని ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు బుధవారం మాజీ సీఎం 'X'లో పోస్టు చేశారు.