కొనకనమిట్ల: ప్రైవేట్ లైన్మెన్ల మృతిపై దర్యాప్తు

53చూసినవారు
ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం సిద్దవరం గ్రామ సమీపంలో గురువారం పొలంలో విద్యుత్ వైర్లు ఏర్పాటు చేస్తున్న సందర్భంలో విద్యుత్ షాక్ కు గురై పెద్దారవీడుకు చెందిన నాగరాజు, రంగారావు మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారాన్ని అందుకున్న స్థానిక ఎస్సై రాజ్ కుమార్ మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం కొరకు మృతదేహాలను పొదిలికి తరలించామని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి వివరాలు వెల్లడిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్