ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని కోలా భీమునిపాడు గ్రామంలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. కబ్జాదారులపై ల్యాండ్ గ్రాబింగ్ చట్టంతో కటకటాలపాలు చేస్తామనికఠినంగా వ్యవహరిస్తామని ఎమ్మెల్యే నారాయణరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.